mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోర్టుల పరిధి కుదింపు

7 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రామాయపట్నం, బందరుపై కీలక నిర్ణయం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్రంలోని రెండు ప్రధాన ఓడరేవుల పరిధిని కుదిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల భౌగోళిక పరిమితుల హేతుబద్ధీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోర్టులు పరిధిని 15 కిలోమీటర్లకు తగ్గించారు. అదనంగా ఉన్న భూమి నిరుపయోగంగా ఉందన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు విడివిడిగా రెండు ఉత్తర్వులు జారీ చేసింది. గత ఉత్తర్వుల మేరకు రామాయపట్నం పోర్టు పరిధి సుమారు 51 కిలోమీటర్ల తీరప్రాంతం వరకు విస్తరించి ఉంది. ఇంత విస్తీర్ణం గల భూమి ప్రస్తుతం పోర్టు కార్యకలాపాలు, భవిష్యత్ అభివృద్ధి అవసరాలకు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం పోర్టు పరిధిలో ఎక్కువ భాగం వినియోగంలో లేదని, అది పోర్టు కార్యకలాపాలకు తక్షణ ప్రయోజనం కల్పించడం లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సమీప ఇతర పోర్టుల అధికార పరిధులతో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో పాటు సమగ్ర తీరప్రాంత అభివృద్ధికి కూడా ఆటంకం కలగవచ్చని వివరించారు. ​ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ పాలసీ–2024 లక్ష్యాలకు అనుగుణంగా పోర్టుల పరిమితులను హేతుబద్ధీకరించాలని ప్రతిపాదించారు. ఈ నేపథంలోనే సుమారు 51 కిలోమీటర్ల పరిధిగా ఉన్న ఈ పోర్టు పరిధిని 15 కిలోమీటర్ల తీరప్రాంతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.​

నిర్మాణ దశలో ఉన్న మచిలీపట్నం పోర్టు పరిధిని కూడా తగ్గిస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పోర్టు పరిధి 64 కిలోమీటర్లుగా ఉండగా, అక్కడ కూడా పెద్ద మొత్తం వినియోగంలో లేనట్టు గుర్తించారు. అందుకే దీని పరిధిని కూడా 49 కిలోమీటర్లు కుదించి 15 కిలోమీటర్లకు ఖరారు చేశారు. ​ఈ కొత్త నిర్ణయం ప్రకారం రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల కొత్త పరిధి ఈ నెల 29 నుంచి అంటే సోమవారం నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్