గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

స్కూల్ రూమ్ లో కుప్పకూలిన టీచర్.. గుండెపోటుతో మృతి

1 గంట క్రితం

Putluru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పుట్లూరు : స్కూల్ రూమ్ లోనే కుప్పకూలిన టీచర్‌, గుండెపోటుతో మరణించారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపాల్ ఓబుల్ రెడ్డి వివరాల మేరకు ఏపీ మోడల్ స్కూల్, పుట్లూరులో ఆటోమోటివ్ ట్రేడ్ విభాగంలో ఒకేషనల్ టీచర్‌గా పనిచేస్తున్న ఎ. ఐశ్వర్య ఉదయం 8:30 గంటలకు స్కూలుకి వచ్చారు. తన లగేజీని విశ్రాంతి గదిలోకి భద్రపరచడానికి వెళ్లారు. ఆ వెంటనే టీచర్ కుప్పకూలిపడిపోయారు. తోటి టీచర్లు గమనించి వెంటనే పుట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి 108 లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిని తరలిస్తుండగా మార్గమధ్యంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. గంటల వ్యవధిలోనే పుట్లూరు బస్లాండ్‌లో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలో 60 సంవత్సరాల వ్యక్తి పుట్లూరు బస్టాండ్ లో కుప్పకూలి పోయారు. ఆసుపత్రికి తరలించగా .. మెరుగైన వైద్యం కోసం తాడిపత్రి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్