ప్రజాశక్తి - నిజాంపట్నం : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో యుటిఎఫ్ ముందంజలో ఉంటుందని రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ బాపయ్య అన్నారు. గురువారం యుటిఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో సవరణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని సూచించారు. అలాగే ఐఆర్ ను, డి ఏ లను ప్రకటించాలని అన్నారు. ఈ సభ్యత్వ క్యాంపెన్లో యుటిఎఫ్ నిజాంపట్నం మండలం గౌరవ అధ్యక్షులు సిహెచ్ రాజభూషణం, జిల్లా కౌన్సిలర్ డి హరిబాబు, ఎండి హుస్సేన్ , యు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో యుటిఎఫ్ ముందంజ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 04:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)