గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పుస్తకాల పేరుతో దోచుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్‌ను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ

2 గంటల క్రితం

SFI stops private schools from profiteering through the sale of books
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 04:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పాతపట్నం : పుస్తకాల పేరుతో దోచుకుంటున్న పాతపట్నం ప్రైవేట్‌ స్కూల్స్‌ రవీంద్రభారతి, సెంటెన్స్‌, కార్మెల్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ను ఎస్‌ఎఫ్‌ఐ అడ్డుకుంది. గురువారం పాతపట్నం మండలంలోని రవీంద్ర భారతి, సెంటెన్స్ , హిరమండలం లో గల కల్ట ప్రాంతం నందు పుస్తకాల అమ్మకాలను అడ్డుకున్నట్లు ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా నాయకులు తెలిపారు. పుస్తకాల గూడౌన్‌కు పాతపట్నం, హిరమండలం ఎంఈఓల నేతృత్వంలో తాళాలు వేయించామని అన్నారు. చదువు ను అడ్డుపెట్టుకొని వ్యాపారంగా మార్చుతున్న పాతపట్నంలోని రవీంద్ర భారతి, సెంటెన్స్, హిరమండలం లో గల కల్ట కార్మెల్ యాజమాన్యం పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు విక్రయించడమే కాకుండా, తమ పాఠశాలలోనే పుస్తకాలు, షూస్ కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. ఈ స్కూల్స్‌ యాజమాన్యంపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చదువు బోధించాల్సిన విద్యాలయంలో వ్యాపారం చేయడం ఏంటని నిలదీశారు. సమాచారం అందించినా మండల విద్యాశాఖ అధికారులు తెలియనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా విద్యాశాఖ అధికారి(డి.ఈ.ఓ), డిప్యూటీ డి.ఈ.ఓలు కూడా సమాధానమివ్వకపోవడం దారుణమని అన్నారు. విద్యాసంస్థలకు తొత్తుగా మారుతున్న విద్యాశాఖ అధికారులు పై కూడా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై గుర్తించి, రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి. చందు, కార్యదర్శి పి.ఖగేష్ , పాతపట్నం నియోజకవర్గ ఎస్ఎఫ్ఐ నాయకులు వినయ్, చరణ్, మురళి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్