గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

2 గంటల క్రితం

ys jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అండగా ఉంటామని హామీ

విజయవాడ: పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఈ రోజు ఉదయం విజయవాడకు చేరుకున్న జగన్ క్రాంతి కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిఐ నాగరాజు 3నెలలుగా వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో ద్వారా క్రాంతి కుమార్ చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ తెలిపారు. క్రాంతికుమార్ పై ఎటువంటి కేసులు లేవని, అయినా స్టేషన్ కు రావాలంటూ టార్చర్ చేసారని తెలిపారు. టాక్సీ నడుపుతూ జీవిస్తున్న వ్యక్తిని వేధించడంతో ఆయన కుటుంబం క్రాంతికుమార్ ని కోల్పోయిందని ఆగ్రహించారు. పోలీసులు చేయకూడని పనులు క్రాంతికుమార్ చేయాలని వేధించి, పేద కుటుంబానికి అండ లేకుండా చేశారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన వీడియో ఫ్యూటేజ్ మాయం అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాంతికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్