mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌‌పై మళ్లీ అమెరికా దాడులు

2 రోజుల క్రితం

attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఒప్పందంపై అనిశ్చితి

టెహ్రాన్ : ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగానే, మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. హర్మూజ్‌లో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ దళాలు వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి చేశాయని ఆరోపిస్తూ అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోని కీలక క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీరప్రాంత రాడార్ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు నిర్వహించింది. ఈ కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియక ముందే ఉల్లంఘించారంటూ ఇరు దేశాలు పరస్పరం విమర్శించుకున్నాయి.

ఏం జరిగింది?

హర్మూజ్‌ జలసంధిలో ఒక సరకు నౌకపై ఇరాన్‌ డ్రోన్ దాడి చేసిందని అమెరికా ఆరోపించింది. దీన్ని యుద్ధవిరమణ ఉల్లంఘనగా పరిగణించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘వాళ్లు నాలుగు దాడులు చేశారు, నాకది నచ్చలేదు’’ అని తెలిపారు. అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లో మిసైల్, డ్రోన్ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ స్థావరాలపై సుమారు గంటసేపు భీకర దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌‌జిసి) గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు సంబంధించిన లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. శనివారం బహ్రెయిన్‌పై కూడా ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయని బహ్రెయిన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా దాడులను "అమెరికా చార్టర్, యుద్ధవిరమణ అవగాహనకు బహిరంగ ఉల్లంఘన" అని ఖండించింది. పార్లమెంట్ జాతీయ భద్రతా కమిషన్ అధ్యక్షుడు ఇబ్రహీం అజీజీ శనివారం మీడియాతో మాట్లాడుతూ, అమెరికా చర్చలు జరుపుతూనే దాడులకు తెగబడిందన్నారు. ఇరాన్‌ ‌ప్రతిఘటనతో ఎప్పటిలాగే అమెరికా వెనుతిరిగిందని తెలిపారు. అలాగే దాడులు పునరావృతం అయితే

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్