...380.70 గ్రాముల బంగారం, 2కేజీల 854 గ్రాముల వెండి స్వాధీనం : ఎస్పీ బిందు మాధవ్ వెల్లడి
ప్రజాశక్తి-కాకినాడ : నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి 380.70 గ్రాముల బంగారం, రెండు కేజీల 800 గ్రాముల వెండి వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని అలాగే ఇంకా బిక్కవోలు పోలీస్ స్టేషన్ సంబంధించి కేసులో 46 గ్రాముల బంగారంను, తణుకులోని మనప్పురం గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్ నుండి రికవరీ చేయాల్సి ఉందని కాకినాడ జిల్లా పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి వివరాలను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బిందు మాధవ్ మాట్లాడుతూ ... ఇటీవల జరిగిన ఇంటి చోరీ కేసులను ఛేదించి, నలుగురు అంతరజిల్లా నేరస్తులను అరెస్ట్ చేసి, ఒక బాల నేరస్తుడును అదుపులోకి తీసుకున్నామన్నారు. కాకినాడ జగన్నాథపురానికి చెందిన ధర్మాడి దుర్గాప్రసాద్ (32), అనపర్తి మండలం బలబద్రపురం గ్రామానికి చెందిన గొర్రిపూడి వెంకటరమణ (43), అనపర్తి మండలం కుతుకులూరు గ్రామానికి చెందిన పాసి శేఖర్ (24), తాడేపల్లిగూడెం కాకర్లపూడి గ్రామానికి చెందిన గేదెల మహేష్ (30), ఒక బాల నేరస్తుడును అదుపులోకి తీసుకోగా, కాకినాడ జగన్నాధపురం గోలీలు పేటకు చెందిన చుక్క ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. వీరివద్ద నుండి 380.7 గ్రాముల బంగారం, 2.854 కిలోల వెండి, ఒక ల్యాప్‌టాప్ మొత్తం 57 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశామని తెలిపారు. నిందితులు రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని ఈ కేసును ఛేదించి నిందితులను కోరంగి గ్రామ శివాలయం వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్ళినప్పుడు పోలీసులకు సమాచారాన్ని అందించాలని వారు అక్కడ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా కాపాడుతారని చెప్పారు. అలాగే అంతకుముందు ఆటో డ్రైవర్లతోనూ తల్లిదండ్రులతో ఎస్పీ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరిమితికి మించి విద్యార్థులను ఆటోలో పాఠశాలకు తీసుకువెళ్లొద్దని అందుకు ఆటో డ్రైవర్లకు తల్లిదండ్రులు సహకరించవద్దని ఎస్పీ సూచించారు. దొంగలను అరెస్ట్ చేయడంలో విశేష కృషి చేసిన కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవ్ రాజ్ మనీష్, ఇంద్రపాలెం ఎస్‌ఐ ఎం వీరబాబు, క్రైమ్ ఎస్‌ఐ బి వెంకటేశ్వర్లు, క్రైమ్ సిబ్బంది కే గోవిందరావు, ఆర్ శ్రీనివాసరావు, కెఎస్ వర్మ, ఎల్ అజయ్ కుమార్, ఎస్ ఆంజనేయస్వామి, ఎస్ బంగారు రాజు, ఇంద్ర పాలెం స్టేషన్ సిబ్బంది పిఎల్వివిఎస్ ప్రసాద్, వై రమేష్, ఎండి మొయిన్, సిహెచ్ సూర్య తేజాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు.








కామెంట్‌లు (0)