mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కామ్రేడ్ యార్లగడ్డ జోయ భౌతికాయానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు నివాళి

1 గంట క్రితం

కామ్రేడ్ యార్లగడ్డ జోయ భౌతికాయానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు నివాళి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : సిపిఐ(ఎం) నందిగామ డివిజన్ నాయకురాలు, రాష్ట్ర రైతు సంఘం సభ్యురాలు కామ్రేడ్ యార్లగడ్డ జోయ మృతికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త తెలుసుకుని అమరావతి ఐకాన్, బి-బ్లాక్-201లో ఉంచిన యార్లగడ్డ జోయ పార్థీవ దేహాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మంగళవారం సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జోయ ప్రజా ఉద్యమాలు, రైతు సమస్యల పరిష్కారం కోసం చేసిన సేవలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్మరించుకున్నారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన యార్లగడ్డ జోయ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్