mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖాన్‌ సర్‌ అరెస్ట్‌పై స్టేను పొడిగించిన పాట్నా కోర్టు

1 గంట క్రితం

Khan Sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాట్నా : కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కాల్పుల కేసులో విద్యావేత్త ఫైసల్‌ ఖాన్‌ అలియాస్‌ ఖాన్‌సర్‌ అరెస్ట్‌పై స్టేను పాట్నా కోర్టు పొడిగించింది. జులై 3 తదుపరి విచారణ తేదీ వరకు ఆయనకు అరెస్ట్‌ నుండి రక్ష‍ణ కల్పించింది. ఖాన్‌ సర్ ఇద్దరు సెక్యూరిటీ గార్డుల గన్‌ లైసెన్స్‌ల వివరాలను సమర్పించాల్సిందిగా మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు కోరింది. జూన్‌ ప్రారంభంలో కొందరు దుండగులు ఆయన కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌పై దాడికి దిగిన సమయంలో ఆయన సెక్యూరిటీ గార్డులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఖాన్‌ సర్‌ పేరు ఉంది. దీంతో ఆయన అరెస్టు నుండి ముందస్తు రక్ష‍ణ కోసం కోర్టును ఆశ్రయించారు. జూన్‌ 9న కోర్టు ఆయనకు రక్ష‍ణ కల్పించగా, అనంతరం జూన్‌ 30 వరకు పొడిగించింది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఖాన్‌ ఇద్దరు సెక్యూరిటీ గార్డుల బెయిల్‌ పిటిషన్లపై కూడా కోర్టు జులై 3న విచారణ చేపట్టనుంది. ఈ కేసులో నిందితులలో ఒకరైన రోషన్‌ ఆనంద్‌ బెయిల్‌పై విడుదలయ్యారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్