mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవివక్షాపూరితం !

8 గంటల క్రితం

brindakarat.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:25 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • నిధుల కేటాయింపులో *దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం

  • కేంద్రానికి సిపిఎం సీనియర్‌ నేత బృందా కరత్‌ లేఖ

  • సమాఖ్యవాదాన్ని బలహీనపరుస్తోందంటూ విమర్శ

న్యూఢిల్లీ : విబి-గ్రామ్‌ ‌జి నిబంధనలను ఉసంహరించుకుని, పాత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నే (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) అమలు చేయాలని సిపిఎం నేత బృందా కరత్‌ ‌కేంద్రాన్ని కోరారు. కొత్త ఉపాధి చట్టం నిర్ణయాక క్రమాన్ని కేంద్రీకరిస్తోందని, సమాఖ్యవాదాన్ని బలహీనపరుస్తోందని ఆమె పేర్కొన్నారు. కార్మికులు నివసించే ప్రాంతాన్ని బట్టి వారిపట్ల స్పష్టమైన వివక్ష చూపే ఒక వ్యవస్థను ఏర్పరస్తోందని అన్నారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌కు బృందాకరత్‌ ‌సోమవారం ఒక లేఖ రాశారు.

విబి-గ్రామ్‌ ‌జి కింద నిధుల కేటాయింపునకు సంబంధించిన ప్రామాణికాలు న్యాయమైనవిగా లేవని ఆమె పేర్కొన్నారు. ఈ కొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రధానంగా సాంకేతికతపై ఆధారపడి వుందని, వేతన నిర్ధారణకు ఎలాంటి ప్రామాణికాలు లేవని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు లేదా యూనియన్లతో ఎలాంటి చర్చలు జరపకుండా ఈ నిబంధనలు ప్రకటించారని బృందా కరత్‌ ‌పేర్కొన్నారు. ఈ నిబంధనలు నిర్ణయించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్రాల, కార్మికుల పాత్రను తగ్గించాయని ఆమె పేర్కొన్నారు.

స్పష్టమైన వివక్ష

నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన అన్ని అధికారాలు కూడా కేంద్రం చేతుల్లోనే వున్నాయని అన్నారు. ప్రామాణిక కేటాయింపును నిర్ణయించే నిబంధన, కార్మికులు నివసించే ప్రాంతాలను బట్టి వారిపై స్పష్టమైన రీతిలో వివక్ష చూపే ఒక వ్యవస్థ లేదా విధానాన్ని ఏర్పాటు చేస్తోందని ఆమె విమర్శించారు. ముసాయిదా నిబంధనల ప్రకారం, నిధుల కేటాయింపు అనేది ‘‘16వ అర్ధిక సంఘం సిఫార్సు చేసిన, భారత ప్రభుత్వం ఆమోదించిన నిధుల బదిలీపై ఆధారపడి వుంటుంది.’’ అత్యంత సంపన్న రాష్ట్రాలతో పోలిస్తే ఒక రాష్ట్ర తలసరి జిఎస్‌‌డిపి ఎంత తక్కువగా వుందో ఈ విధానం లెక్కిస్తుంది. దీనికి 42.5శాతానికి పైగా వెయిటేజీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత వెయిటేజీ జనాభా (17.5శాతం) కు ఇచ్చారు. అంటే దీనివల్ల పెద్ద రాష్ట్రాలు లాభం పొందుతాయని అన్నారు. ‘‘ చట్టం ప్రకారం పని కావాలని డిమాండ్‌ ‌చేసే గ్రామీణ కార్మికులకు ఈ ప్రామాణికాలతో పనేంటి ?’’ అని ఆమె ప్రశ్నించారు.

నిబంధనలు అభ్యంతరకరం....

నిధుల కేటాయింపునకు సంబంధించిన ప్రమాణాలు అత్యంత అభ్యంతరకరమైనవిగా వున్నాయని, వివక్షతో కూడినవని, వాటిపై తక్షణమే దృష్టి కేంద్రీ కరించాల్సిన అవసరం ఎంతైనా వుందని బృందా కరత్‌ ‌పేర్కొన్నారు. తక్కువ జనాభా కలిగిన దక్షిణాది రాష్ట్రాలకు సగటున పనిదినాలు అత్యధికంగా కల్పిస్తున్నాయి. ఉదాహరణకు, కేరళ ఏడాదిలో సగటున 66 పనిరోజులను కల్పిస్తోంది. ఇది జాతీయ సగటు కంటే చాలా అధికం. అయితే, జనాభాకు 17శాతం వెయిటేజీ ఇచ్చినపుడు కేరళకు నిధులు అందవు. జిఎస్‌‌డిపికి సంబంధించి టాప్‌ ఐదు రాష్ట్రాల్లో తమిళనాడు వుంది. అయినా క్రియాశీలంగా వున్న ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికుల సంఖ్య అక్కడ అధికం. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన ప్రామాణికాలకు పని డిమాండ్‌‌కు ఎలాంటి సంబంధం లేదని వాస్తవాలు చూస్తే తెలుస్తోందని బృందా కరత్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

అధిక జిఎస్‌‌డిపి, తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాలకు తక్కువనిధులు అందుతాయి. పైగా, ఈ కేటాయింపుల్లో కొంత మొత్తం మెరుగైన పనితీరుకు బహుమతిగా ఇవ్వాల్సి వుంటుందని నిబంధనలుపేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాల సమర్ధత లేదా అసమర్ధతకు పని హక్కు అనేది బందీగా మారాలా? అని ఆమె ప్రశ్నించారు. నిధుల కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదిత ఫార్మూలా పట్ల బృందా కరత్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటున్నప్పటికీ కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఈ నిబంధన ప్రతికూలంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. వేతన చెల్లింపులు, ఆన్‌‌లైన్‌ ‌నమోదు, ఇ-కెవైసి ధృవీకరణ వంటి వాటికి సంబంధించిన నిబంధనలను ఆమె తీవ్రంగా విమర్శించారు. వీటివల్ల స్మార్ట్‌ ‌ఫోన్లు లేదా ఇంటర్‌‌నెట్‌ ‌సదుపాయం అందుబాటులో లేని కార్మికులు పెద్ద సంఖ్యలో నష్టపోతారని ఆమె ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్