mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజ్యసభ సభ్యుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం

1 రోజు క్రితం

Congress chief Kharge takes oath
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 12:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కర్ణాటక నుండి తిరిగి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్‌ అధ్యక్ష‍ుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్‌ తన ఛాంబర్‌లో ఆయనతో ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్లమెంటరీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, వయనాడ్‌ ఎంపి ప్రియాంకగాంధీ వాద్రా హాజరయ్యారు. జూన్ 11న, కర్ణాటక నుంచి రాజ్యసభకు ఖర్గేతో సహా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక బిజెపి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బిజెపి సభ్యులైన ఇరన్న కదాడి, నారాయణ కొరగప్ప, కాంగ్రెస్‌కు చెందిన మల్లికార్జున ఖర్గే, జెడిఎస్‌కు చెందిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడల పదవీకాలం జూన్ 25తో ముగియడంతో ఆ నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం (ఇసి) ఎన్నికలు ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్