న్యూఢిల్లీ : అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో ఎనిమిదిమందిని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ఉన్నతాధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఎనిమిది మందిని గురువారం రాత్రి అరెస్ట్ చేశామని, దర్యాప్తులో భాగంగా వారిని విచారిస్తున్నామని అన్నారు. విరాళాలుగా వచ్చిన నగదు, విలువైన వస్తువుల లెక్కింపులో ఉన్న అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్ (అలియాస్ తిన్ను)లను అదుపులోకి తీసుకున్నామని, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నామని అన్నారు. బిఎన్‌ఎస్‌లోని సెక్షన్ 306, 316, 317, 61 కింద కేసు నమోదైందని అన్నారు. రామమందిరానికి వచ్చిన విరాళాల్లో అ్రకమాలు చోటుచేసుకున్నాయన్న ప్రకటన జూన్ 7న వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరాళాల అక్రమాలపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో గురువారం అయోధ్య రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో ఎనిమిది మంది అరెస్ట్
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 26, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)