mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపకుడే సంఘానికి వీడ్కోలు - కాలేజీ కాంపౌండ్ గోడ నిర్మాణ వివాదమే కారణమా ?

23 జూన్, 2026

narpala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 12:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి, నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పల లో పాఠశాల, జూనియర్ కళాశాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పూర్వ విద్యార్థి కొలిమి బాబా సలాం గత 20 సంవత్సరాల క్రితం నార్పల ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసి 2014 లో నార్పల ప్రభుత్వ పాఠశాల 60 వసంతోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలు విజయవంతం కావడానికి బాబా సలాం కృషి ప్రశంసనీయం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు అందరిని కలసి పాఠశాల కళాశాల అభివృద్ధికి చాలా కృషి చేశాడు సంఘ సభ్యులు ఎవరు పక్కకు పోయినా వారి సమస్య తెలుసుకొని సంఘాన్ని రాజకీయాలు, వర్గాలకు అతీతంగా కేవలం పాఠశాల కళాశాల అభివృద్ధికి పని చేసే విధంగా బాబా సలాం కృషి చేశారు పాఠశాల, కళాశాల లో ఏ సమస్య జరిగిన పాఠశాల ఉపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు బాబా సలాం దృష్టికి తెచ్చేవారంటే కళాశాల తోను పాఠశాల తో అతనికి ఉన్న అనుబంధం ఎటువంటిదో అర్థమవుతుంది గత నాలుగు రోజుల క్రితం నార్పల జూనియర్ కళాశాల రోడ్డు వైపు ఉన్న ప్రహరీ గోడ నిర్మాణానికి కళాశాల ప్రిన్సిపాల్ బాలప్ప కాంట్రాక్టర్ ఆదినారాయణ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు గతంలో కళాశాల పాఠశాల స్థలంలో పలువురు కటింగ్ దుకాణాలు, మెకానిక్ షెడ్లు వేసుకొని కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగించేవారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాల స్థలం అన్యాక్రాంతం అవుతుందని గత ఐదు సంవత్సరాల క్రితం ఆక్రమణకు గురైన పాఠశాల కళాశాల స్థలంలోని దుకాణాలను అప్పటి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఖాళీ చేయించారు అప్పటినుంచి ఆ స్థలంలో ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేస్తూ వస్తున్నారు అయితే గతంలో ఆక్రమణకు గురైన పాఠశాల కళాశాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని హద్దు వరకు ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులు పూర్వ విద్యార్థులు గుంతలు తీయించారు తదనంతరం గుంతలను పూడ్చి వేయడం జరిగింది మొత్తానికి ఏమి జరిగిందో తెలియదు కానీ పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఏర్పాటు చేసి పాఠశాల, కళాశాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసే బాబా సలాం సామాజిక మద్యమాల్లో పూర్వ విద్యార్థుల సంఘానికి వీడ్కోలు అంటూ పోస్టులు పెట్టడంతో పలువురు పూర్వ విద్యార్థులు పలు రకాలుగా చర్చలు చేస్తున్నారు కళాశాల, పాఠశాల స్థలం రోడ్డు వైపు ఎంత వరకు ఉందో అంతవరకు ప్రహరీ గోడను నిర్మిస్తారా లేకపోతే ఆక్రమణలు చేసుకోండి అంటూ అలాగే వదిలేస్తారా లేక కళాశాల పాఠశాల అభివృద్ధికి దుకాణ సముదాయాన్ని నిర్మిస్తారా అని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు దీనిపైన స్థానిక ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు మొత్తానికి ప్రహరీ గోడ నిర్మాణం ఎలా జరుగుతుందో లేచి చూడాల్సిందే.....


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్