mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలుగు రాష్ట్రాలకే మార్గదర్శకులు కళారత్న సింగమనేని నారాయణ

4 రోజుల క్రితం

Kalaratna Singamaneni Narayana: A guiding light for the Telugu states.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 04:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనంతపురం : సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు సింగమనేని నారాయణ రాసిన కథలు, వ్యాసాలు అధ్యయనం చేస్తే పల్లె జీవితంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రీకరించి భుజాన వేసుకున్న రైతు పక్షపాతి,తెలుగు రాష్ట్రాలకు మార్గదర్శకులు, మంచి స్కృహ కలిగిన కథకుడని జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు కొత్తపల్లి సురేష్ అన్నారు. కళారత్న సింగమనేని నారాయణ గారి 83వ జయంతి సందర్భంగా ... శుక్రవారం తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సాహితీ మిత్రుల సహకారంతో స్థానిక విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రాంగణంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు తెలుగు వెలుగు అధ్యక్షులు టివి రెడ్డి అధ్యక్షత వహించారు. చిత్రపటానికి పూలమాలవేసి ప్రతి ఒక్కరు పుష్పాంజలి సమర్పించి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సాహితీ పెద్దలు ఉమ్మడిశెట్టి సాహితీ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రాధేయ, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, మానవతా రక్తదాతల కన్వీనర్ తరిమెల అమరనాథ రెడ్డి, అనంత సాహితీ ప్రస్థానం అధ్యక్షులు గంగిరెడ్డి అశ్వత్థరెడ్డి, పర్యావరణ పరిరక్షకులు భాష మాట్లాడుతూ .... టీచర్ గా వృత్తిని కొనసాగిస్తూ, టీచర్ల ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. విరసం సభ్యులుగా కొనసాగుతూ కొంతకాలం తర్వాత జనసాహితీ సంస్థకు బాధ్యులుగా పనిచేశారు. ఆయన రచయితలను ప్రోత్సహించే వారిని, అందరిని అభిమానించే గుణం ఎక్కువగా ఉండేది. ఆయన కథలలో మాండలిక పదాలు ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా స్పష్టతగా ఉండేవి. కొందరు ప్రముఖులు పబ్లిక్ గా ఒకరకంగా వ్యక్తిగతంగా ఒకరకంగా ఉంటారు కానీ సింగమనేని ఒకే రకంగా హుందాగా ఉండే వారిని వారి జ్ఞాపకాలను పంచుకున్నారు.


గుడిపాటి సూర్యంకు సత్కారం

కవి, రచయిత గుడిపాటి సూర్యం వర్తమాన రచయితగా సాహిత్య కృషి చేస్తున్నారు, తోటి రచయితలకు ప్రోత్సాహం అందించడం వలన కవులు రచయితలు ఎదుగుతారని సింగమనేని అభిప్రాయం. ఆయన స్మృతిలో రచయిత గుడిపాటి సూర్యంకు తెలుగు వెలుగు సంస్థ శాలువతో సత్కరించి, పుస్తకాలను, జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిరసం నాయకులు కోటిగారి వన్నప్ప, గోసల నారాయణస్వామి,మధుర శ్రీ, మిద్దె మురళీకృష్ణ, గంగిరెడ్డి విశ్వనాథరెడ్డి కవులు డాక్టర్ అంకె రామలింగయ్య,లక్ష్మీశ్యాం, చంద్రశేఖరశాస్త్రి, ఉమర్ అలీషా సాహితీ సమితి అధ్యక్షులు షేక్ రియాజుద్దీన్, డాక్టర్ జూటూరు షరీఫ్, పూజారి ఈరన్న, సామాజిక సేవకులు ఆశ్రయ అనాధాశ్రయ నిర్వాహకులు ఎర్రగుంట కృష్ణారెడ్డి, చంద్రశేఖర్, చెట్ల ఈరన్న,చెట్ల ప్రవీణ్, హరీష్, చలపతిరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్