mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నార్పలలో ట్రాఫిక్ అస్తవ్యస్తం.. రోడ్డుకు అడ్డంగా ఆటోలు ప్రైవేటు వాహనాలు..

23 జూన్, 2026

Traffic chaos in Narpala... auto-rickshaws and private vehicles blocking the road.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలలో గత రెండు రోజుల నుంచి గుగుడు కుల్లాయి స్వామి దర్శనానికి భక్తులు భారీ ఎత్తున వస్తుండడం ఆ భక్తులందరూ నార్పల మీదనే ప్రయాణం చేస్తుండడంతో మండల కేంద్రమైన నార్పల బస్టాండు, కూతలేరు వంతెన గూగుడు రోడ్డులో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం దానికి తోడు రోడ్డుపై ఆటోలు ప్రైవేటు వాహనాలు అడ్డంగా ఉంచుతుండడం తో తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మౌత్సవాల్లో ప్రధాన ఘట్టాలు అయిన చిన్న సరిగెత్తు, పెద్ద సరిగెత్తు, స్వామి అగ్నిగుండ ప్రవేశం, జలది కార్యక్రమాలు ప్రారంభం కాకనే ట్రాఫిక్‌ సమస్య ఇలా ఉంటే ప్రధాన ఘట్టాల సమయంలో ఎలా ఉంటుందో అని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుళ్లాయి స్వామి దర్శనానికి భక్తులు ఎక్కువ బస్సులు తక్కువ గూగూడు కుల్లాయి స్వామి స్వామి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు భక్తులకు తగ్గట్టు బస్సులు మాత్రం లేవని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ వారు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది దీనిపై అనంతపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీకాంత్ ను వివరణ కోరగా ఇప్పటివరకు అనంతపురం నుంచి గూగుడు కి భక్తుల రద్దీని బట్టి స్పెషల్‌ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని 26 వతేది నుంచి అనంతపురం డిపో నుండి 50 ప్రత్యేక బస్సులు తాడిపత్రి డిపో నుండి 25 ప్రత్యేక బస్సులు అదేవిధంగా సత్యసాయి జిల్లా ధర్మవరం డిపో నుండి పది ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కుల్లయ్య స్వామి బ్రహ్మోత్సవాలు మురిసే వరకు భక్తుల సౌకర్యార్థం 85 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని సాధ్యమైనంతవరకు కుళాయి స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. నార్పల లో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులను ఏర్పాటు చేస్తాం. ఎస్ఐ సాగర్‌ మండల నార్పల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని మంగళవారం నుంచి స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు గూగూడుకు వస్తున్నారని. ఉన్న సిబ్బంది మొత్తం గూగూడు లోనే ఉన్నారని మంగళ వారం నుండి గూగూడు తో పాటు నార్పల లో కూడా ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులను ఏర్పాటు చేస్తామని ఎస్ఐ సాగర్‌ తెలిపారు.


గుగూడు కు వచ్చే మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై సాగర్.....

కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుళాయి స్వామి దర్శనానికి వచ్చే మహిళలు అప్రమత్తంగా ఉండాలని శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కిలాడీ లేడీలు బంగారు ఆభరణాలు వేసుకొని బస్సుల్లో వచ్చే మహిళలను వెంబడిస్తూ బస్సులలో ఉన్న రద్దీని అదనుగా చూసుకొని చోరీలకు పాల్పడే అవకాశం ఉందని స్వామి దర్శనానికి బస్సులో ప్రయాణించేవారు భారీ ఎత్తున బంగారం ధరించరాదని అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాగర్ తెలిపారు.. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోరీలు జరగకుండా గూగూడు మొత్తం డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టడంతోపాటు ఎక్కడికక్కడ కూడలి ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు..


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్