- నూతన కమిటీ చైర్మన్గా కొట్టాడా వెంకటరావు
- సభ్యులు సహాయ సహకారాలు అభివృద్ధికి కృషి చేస్తా
ప్రజాశక్తి, విజయనగరం కోట: విజయనగరం పట్టణంలో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలకమండలి సభ్యులు, చైర్మన్ నియామకం బుధవారం జరిగింది. ముందుగా ఆలయ ఈవో కే వెంకట్రావు సభ్యులు పేర్లను చదవగా ఆ సభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ ను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ మాట్లాడుతూ ఈ ఆలయం గత 150 సంవత్సరాలు చరిత్ర కలిగినది అన్నారు ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఐవిపి రాజు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఆలయం అన్నారు. అనురాధపేట మాట్లాడుతూ నూతన కమిటీ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. నూతన చైర్మన్ వెంకట్రావు మాట్లాడుతూ ఈ ఆలయ చైర్మన్ గా ఎన్నిక కావడంతో ఎంతో బరువు బాధ్యతలు పెరిగే అన్నారు కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆలయ కమిటీ సభ్యులుగా త్రినాధరావు సూర్య కళ ధనలక్ష్మి మోహన్ రావు శివకుమార్ దేవి సత్యవతి తదితరులు నిర్మించబడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కర్రోజ్ నర్సింగరావు, మైలపిల్లి పైడిరాజు, కొండ్రు శ్రీనివాసరావు,ముద్ధాడ చంద్రశేఖర్, పడాల జోకేష్ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)