mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జెట్ బ్లూ విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్

3 గంటల క్రితం

Drone collides with JetBlue aircraft
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 11:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమెరికా : అమెరికాలో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లాస్‌ వెగాస్‌ నుంచి వచ్చి ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్‌ బ్లూ ఏయిర్‌లైన్స్‌ విమానాన్ని.. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్‌ విమానాశ్రయ సమీపంలోని డ్రోన్‌ ఢీకొట్టింది. అప్పటికి ఏయిర్ లైన్స్ విమానం 3 వేల అడుగుల ఎత్తులో ఉంది. విమానంలో 159 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. విమాన కాక్‌పిట్‌ బయటి భాగాన్ని డ్రోన్‌ తాకిందని పైలట్‌ ఏయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ATC)కు తెలిపాడు. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని, విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని జెట్‌ బ్లూ ఏయిర్‌లైన్స్‌ వెల్లడించింది. ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. విమానాశ్రయ పరిసరాల్లో ప్రతి నెలా దాదాపు 100 డ్రోన్లను గుర్తిస్తున్నామని, నిషేధిత గగనతలంలో వీటిని ఎగరవేస్తే వారి లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఏఏ హెచ్చరించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్