కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని హల్దియాలో నాప్తా (హైడ్రోకార్బన్ మిశ్రమం) పైప్‌లైన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.
వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ మేద్నీపూర్ జిల్లాలో హల్దియా పెట్రో కెమికల్స్ ప్రై.లి (హెచ్‌పిఎల్)లో నాప్తాను రవాణా చేసే పైప్‌లైన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హల్దియా మున్సిపాలిటీలోని 13వ వార్డులోని చిరంజీబ్‌పూర్ ప్రాంతంలో తెల్లవారుజామున 2.45 గంటల ప్రాంతంలో మంటలను మొదట గుర్తించినట్లు, అవి వేగంగా వ్యాపించి అనేక ఇళ్లను చుట్టుముట్టాయి. ప్రమాదస్థలానికి 12అగ్నిమాపక యంత్రాలు చేరుకుని, మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదంలో స్థానికులతో సహా 20 మందికి పైగా గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కొందరు ఇక్కడే చికిత్స పొందుతుండగా, మరికొందరిని కోల్‌కతాలోని ఆస్పత్రులకు తరలించారని అన్నారు. గాయపడిన వారిలో కంపెనీకి చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారని అన్నారు.









కామెంట్‌లు (0)