గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్రమ అరెస్టును ఖండించిన సిపిఐ(యం) రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు

2 గంటల క్రితం

V Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరుపతి : ట్రేడ్‌యూనియన్ నాయకులు సిహెచ్.చంద్రశేఖర్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండించారు. చంద్రశేఖర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి వస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లా కోడూరులో సిహెచ్‌.చంద్రశేఖర్‌ను ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆయన చిట్వేల్ పోలీసు స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్నారు. ఉపాధి హామీ కొత్త పథకం ప్రారంభించడానికి కేంద్ర మంత్రి వస్తున్న సందర్భంగా నిరసనలు తెలియజేయాలని వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలకు శాపంగా మారుతున్న ఈ తప్పుడు పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవడానికి బదులు ఆందోళన చేస్తున్న వారిని నిర్బంధంచడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. గ్రామీణ పేదలకు మేలు చేసే (పాత) మహాత్మాగాంధీ ఉపాధిహామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్