గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గురుకులాన్ని సందర్శించిన వేపాడ మండల విద్యాశాఖాధికారులు

1 గంట క్రితం

vepada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 02:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి వేపాడ : వేపాడ మండల విద్యాశాఖాధికారులు శ్రీ ఎన్. నాగభూషణరావు, శ్రీ పి. బాల భాస్కరరావు గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సమావేశమై విద్య, క్రమశిక్షణ, పరిశుభ్రతతో పాటు పాఠశాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన అధికారులు, బోధనలో నాణ్యత పెంపు, విద్యార్థుల విద్యా ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలపై సమీక్ష నిర్వహించి, మెరుగైన ఫలితాల సాధనకు అవసరసమైన కార్యాచరణపై చర్చించారు.

ప్రస్తుత వర్షాకాలంలో విద్యార్థులు ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ఎస్‌ఆర్‌కేవీఎం–2 (SRKVM-II) విద్యార్థులందరికీ అవసరమైన సౌకర్యాలు అందాయా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి టి. జయశ్రీతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్