ప్రజాశక్తి-గన్నవరం:విజయవాడ కొత్త బైపాస్‌పై బీబీ గూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.విజయవాడ నుంచి ఏలూరు వైపునకు వెళ్తున్న కంటైనర్ లారీ పంక్చరై అదుపుతప్పి ముందు వెళ్తున్న కారు,ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.దీంతో ఆయిల్ ట్యాంకర్.. ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు,బైక్‌పై వెళ్తున్న ఒకరు మృతిచెందారు. గన్నవరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.కారులో మృతిచెందిన వారిని కైకలూరు మండలం పెంచికలమర్రుకు చెందిన తల్లి జయమంగళ నాగదుర్గ(28),ఆమె కుమారుడు కారుణ్య నాగసాయి(3)గా గుర్తించారు.నాగదుర్గ భర్త విజయ్‌కుమార్‌కు గాయాలయ్యాయి.బైక్‌పై వెళ్తూ మృత్యువాత పడిన వ్యక్తిని సింగ్‌నగర్‌కు చెందిన దాసరి వెంకటేశ్వరరావు(50)గా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది.జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు.మృతదేహాలను గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లారీ పంక్చర్ అవ్వడంతో నలుగురు వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 05:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)