న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న సర్ ప్రక్రియతో పాటు ఎన్నికల సంఘం పాత్ర, ఎన్నికలకు సంబంధించిన సమస్యల గురించి మంగళవారం 23 ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు లేఖ రాశాయి. 23 పార్టీలతో పాటు ఓ ఇండిపెండెంట్ ఎంపీ సంతకం చేసిన లేఖను జస్టిస్ సూర్యకాంత్‌కు పంపినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. ఈ లేఖపై ఇండియా బ్లాక్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలు కూడా సంతకాలు చేశాయి.
కాగా, ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటనతో ఉన్నట్లు జైరాం రమేశ్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
జూన్ 8వ తేదీన జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పైనా, ఎలక్షన్ కమిషన్, ఎన్నికలకు సంబంధించిన సమస్యలపైనా సిజెఐకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు రమేశ్ తెలిపారు. మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ , తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్, హేమంత్ సోరెన్, ఒమర్ అబ్దుల్లా, కపిల్ సిబల్, డెరిక్ ఒబ్రెయిన్ ఆ లేఖపై సంతకం చేశారు.








కామెంట్‌లు (0)