మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరౌడీషీట్ల ప్రొసీడింగ్స్‌ను ఎలా సమర్థించుకుంటారు?

30 సెప్టెంబర్, 2026

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 09:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విజయవాడ పోలీస్‌ కమిషనర్‌‌ను ప్రశ్నించిన హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన వారిపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఎలా సమర్థించుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు నాలుగుకు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కుంచెం మహేశ్వరరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడకు చెందిన బచ్చు మురళీకృష్ణ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్