మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

20 వరకు సీఏపీఎఫ్ బలగాల పొడిగింపు: కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి

1 గంట క్రితం

20 వరకు సీఏపీఎఫ్ బలగాల పొడిగింపు: కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి

20 వరకు సీఏపీఎఫ్ బలగాల పొడిగింపు: కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తి

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 09:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ :

రాజధానిలో విపక్షాలు, విద్యార్థి సంఘాల నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో 273 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) మోహరింపును అక్టోబర్ 20 వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రిత్వ శాఖను విజ్ఞప్తి చేశారు. 'కాక్రోచ్ జనతా పార్టీ', భీమ్ ఆర్మీ, విద్యార్థి సంఘాలు జంతర్ మంతర్, పార్లమెంట్ భవనం, ఎన్నికల సంఘం కార్యాలయం, ఇండియా గేట్ వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో భారీ ఆందోళనలు చేపట్టే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు.


ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఢిల్లీలో నిరసనలు మిన్నంటాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం మొత్తం 301 సీఏపీఎఫ్ కంపెనీల మోహరింపునకు (అక్టోబర్ 6న 221, అక్టోబర్ 8న 80) ఆమోదం తెలపగా, అందులో 28 కంపెనీలు ఇంకా రిపోర్ట్ చేయాల్సి ఉంది.


ఇప్పటికే భద్రతా చర్యల్లో భాగంగా నగరంలో 45 మెట్రో స్టేషన్లను మూసివేసి, సరిహద్దుల వద్ద తీవ్ర తనిఖీలు చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు సహా వేలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంతతను కాపాడేందుకు బలగాల గడువును మరో వారం రోజులు పొడిగించడం అత్యవసరమని పోలీసులు లేఖలో స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్