మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతిపక్షాల నిరసనపై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

1 గంట క్రితం

ప్రతిపక్షాల నిరసనపై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

ప్రతిపక్షాల నిరసనపై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 10:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ :

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాలు నిర్వహించిన కవాతునకు సంబంధించి బరాఖంబా రోడ్డు, తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్లలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు.


ఈ కవాతు‌ నిర్వహణకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, సోమవారం జరిగిన ఈ నిరసన సందర్భంగా పలువురు ప్రతిపక్ష నేతలు మినీ ట్రక్కు సహాయంతో పోలీసు బారికేడ్లను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.


జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు, ఓట్ల తొలగింపులను ఆరోపిస్తూ ‘డెమోక్రసీ మార్చ్‌’ చేపట్టారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధిపతి అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సహా పలువురు ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్