ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మొదటి టెస్ట్ ఆగస్టు 15-19 వరకు గాలె అంతర్జాతీయ స్టేడియంలో, రెండో టెస్ట్ ఆగస్టు 23-27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో (48.15%), శ్రీలంక ఆరో స్థానంలో (44.44%) ఉన్నందున ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. కాగా, భారత్ చివరిసారిగా 2017లో విరాట్ కోహ్లీ సారథ్యంలో శ్రీలంకలో పర్యటించి 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
టీమిండియా శ్రీలంక టెస్ట్ సిరీస్ ఫిక్స్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 06:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)