గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తొలగించిన గ్రీన్ అంబాసిడర్లను వెంటనే పనిలోకి తీసుకోవాలి : సిఐటియు ధర్నా

1 గంట క్రితం

CITU protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 05:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గజపతినగరం : తొలగించిన గ్రీన్‌ అంబాసిడర్లను వెంటనే పనిలోకి తీసుకోవాలని గురువారం సచివాలయం ఎదుట సిఐటియు ధర్నా నిర్వహించింది. మండల పరిధిలో జిన్నాం గ్రామంలో పనిచేసిన నలుగురు గ్రీన్ అంబాసిడర్లను అక్రమంగా తొలగించిన సంగతి తెలిసిందే. తొలగించిన నలుగురు గ్రీన్‌ అంబాసిడర్లను వెంటనే పనిలోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. గురువారం గ్రామంలో పర్యటించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లేందుకు ధర్నా చేపట్టినట్లు ఆమె తెలిపారు. .గ్రామంలో నలుగురు గ్రీన్ అంబాసిడర్లు ఏడు సంవత్సరాలుగా ఎటువంటి రిమార్కు లేకుండా పనిచేశారని అన్నారు. పంచాయతీ పాలన అయిపోయిన వెంటనే పనిమానేయాలని వారిపై పంచాయతీ కార్యదర్శి రెండు నెలలుగా ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. ఏ కారణంతో తొలగించారో కూడా చెప్పడం లేదని అన్నారు. కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగానే వారిని తొలగించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 27 తేదీన ఈవోపీఆర్డిని కలిశామని, ఏప్రిల్ 29న ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా చేసి, వినతిపత్రం ఇచ్చామని అన్నారు. జూన్ 15, జూన్ 23 తేదీల్లో ఎంపీడీవో ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టామని అన్నారు. 24వ తేదీన ఎంపీడీవో మాట్లాడతారని అన్నారని, ఆయనను సంప్రదిస్తే సంబంధం లేదని, మీరే తేల్చుకోండని దురుసుగా సమాధానమిచ్చారని అన్నారు. 2 -3 -2022 సంవత్సరంలో ఎటువంటి కారణం లేకుండా గ్రీన్ అంబాసిడర్ ని తొలగించడానికి లేదని డిపిఓ సర్క్యులర్‌ ఇచ్చారని అన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే వారిని ఉద్యోగం నుండి తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నలుగురు గ్రీన్ అంబాసిడర్లను వెంటనే పనిలోకి తీసుకోవాలని, పంచాయతీ కార్యదర్శని వెంటనే సస్పెండ్ చేయాలని, కులం పేరుతో దూషించిన కార్యదర్శి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కే రాము, అప్పారావు, చిన్న, మగతమ్మ, అప్పన్న, శ్రీను, పి గోపాలరావు, రోనీస్, సూర్యనారాయణ సీతమ్మ గౌరమ్మ తౌడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్