mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

TG20 League - పాలమూరు 148 కే పరిమితం.. నల్గొండ లక్ష్యం 149

23 గంటల క్రితం

TG20 League: Match against Palamuru Strikers... Nalgonda Knights' target is 149.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 04:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : టిజి 20 లీగ్ 2026లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీంతో నల్గొండ నైట్స్ విజయానికి 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పాలమూరుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. విఘ్నేశ్ రెడ్డి (4), చైతన్య రెడ్డి (17), కరణ్ యాదవ్ (0), రోహిత్ రాయుడు త్వరగా పెవిలియన్ చేరడంతో జట్టు 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజ్ఞయ్ రెడ్డి, రతన్ తేజ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రజ్ఞయ్ రెడ్డి 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేసి అర్ధశతకం నమోదు చేయగా, రతన్ తేజ 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు సాధించాడు. మహ్మద్ అఫ్రిది 14 పరుగులతో స్వల్పంగా రాణించాడు. నల్గొండ నైట్స్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా, నిశాంత్ రెండు వికెట్లు తీశాడు. అనికేత్ రెడ్డి, దీవేశ్ సింగ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్