mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసిన : ఎమ్మెల్యే పితాని

1 గంట క్రితం

అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేసిన : ఎమ్మెల్యే పితాని
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : అంగన్వాడీ కేంద్రాల్లో వంట కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా, సురక్షితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్‌లను అందించడం అభినందనీయమని  ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర ప్రాజెక్టు పరిధిలోని  ఆచంట మండలాలకు చెందిన మొత్తం  అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, వంట పాత్రలను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక వంట సదుపాయాలు కల్పించడం వల్ల వంట ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు ఇంధన వ్యయం తగ్గి, కార్యకర్తల శ్రమ  తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్ర ప్రాజెక్టు అధికారి అంగరం కృష్ణకుమారి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్