mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

US Open Badminton: రన్నరప్‌గా కిదాంబి శ్రీకాంత్

1 రోజు క్రితం

Srikanth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 08:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే ఎదురైంది. టైటిల్ కోసం జరిగిన పోరులో శ్రీకాంత్.. రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం గంటకుపైగా హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 15-21, 21-16, 9-21 తేడాతో చైనీస్ తైపీ క్రీడాకారుడు సు లియాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ సీజన్‌లో మొదటిసారి ఫైనల్‌కు చేరిన మాజీ ప్రపంచ నెంబర్ వన్ శ్రీకాంత్‌కు ఈ ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. శ్రీకాంత్ గతేడాది మలేసియా మాస్టర్స్ సూపర్ 500, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీల్లోనూ ఆయన రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన శ్రీకాంత్, ఈసారి ఎలాగైనా టైటిల్ కరవు తీర్చుకోవాలనుకున్నా రన్నరప్ ట్రోఫీతోనే వెనుతిరగాల్సి వచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్