ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ డైరెక్టర్ పోస్టును విబి గ్రామ్ జి డైరెక్టర్‌గా ప్రభుత్వం మార్పు చేసింది. ఈ పోస్టులో ప్రస్తుతం పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్ అధికారి వైవికె షన్ముఖ్‌కుమార్‌ను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 29 వరకు లేదా పోస్టు అవసరం లేని పరిస్థితి ఏర్పడే వరకు, ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి వరకు పోస్టు కొనసాగనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. విబి గ్రామ్ జి జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ పోస్టును కొనసాగించడం అవసరమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ పథకం అమలును పర్యవేక్షించడం, తనిఖీలు నిర్వహించడం, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌కు సహకరించడం వంటి బాధ్యతల్లో డైరెక్టర్ కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ మండలి, రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీలో డైరెక్టర్, ప్రత్యేక కమిషనర్ సభ్యుడిగా వ్యవహరించనున్నారు.
విబి గ్రామ్ జి డైరెక్టర్‌గా షన్ముఖ్‌కుమార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)