రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటరు నమోదు కోసం స్వీకరించిన ఫారం-19 దరఖాస్తుల్లో 14,348 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు గురువారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని 227 మండలాల నుంచి మొత్తం 31,952 దరఖాస్తులు అందాయి. వీటిలో 17,209 దరఖాస్తులను ఆమోదించగా, 395 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 14,348 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 21,782 మంది ఉపాధ్యాయులకు గాను 16,809 దరఖాస్తులు అందాయి. వీటిలో 11,646 ఆమోదించగా, 187 తిరస్కరించారు. మరో 4,976 పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఎఇఆర్ఒల వద్ద 365, ఇఆర్ఒ వద్ద 4,611 దరఖాస్తులు ఉన్నాయి. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో 19,446 మంది ఉపాధ్యాయులకు గాను 15,143 దరఖాస్తులు అందాయి. వీటిలో 5,563 ఆమోదించగా, 208 తిరస్కరించారు. ఇంకా 9,372 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఎఇఆర్ఒల వద్ద 7,045, ఇఆర్ఒ వద్ద 2,327 దరఖాస్తులు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ఫారం-19 దరఖాస్తులను పరిష్కరించాలని ఢిల్లీరావు స్పష్టం చేశారు.








కామెంట్లు (0)