మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘పిఎం-సూర్య ఘర్’ అమలులో 4వ స్థానం

31 నిమిషాల క్రితం

Vijayanand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పిఎం-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలులో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచిందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. విజయవాడలోని విద్యుత్ సౌధలో ఎపి ట్రాన్స్‌‌కో జెఎమ్‌డి సూర్యసాయి ప్రవీణ్ చంద్, డిస్కమ్‌ల సిఎమ్‌డిలు, నెడ్‌క్యాప్ విసి ఎం కమలాకరబాబు, ఎస్‌ఇలు, కెఆర్‌‌ఇసిఎస్‌, ఇపిసి, రెస్కో సంస్థల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్‌ ‌మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7,39,260 ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేశామన్నారు. దేశ వ్యాప్తంగా 56,97,531 ఇళ్లపై ఏర్పాటు చేయగా, అందులో రాష్ట్రం వాటా దాదాపు 13 శాతమని తెలిపారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తొలి 3 స్థానాల్లో ఉన్నాయన్నారు. యుఎల్ఎ విధానంలో ఎస్‌‌సి, ఎస్‌‌టి లబ్ధిదారుల కోసం 5,09,004 ఇళ్లపైనా, క్యాపెక్స్ విధానంలో వినియోగదారుల పెట్టుబడితో 2,30,256 ఇళ్లపైనా సోలార్‌ ‌ప్యానల్స్‌ అమర్చినట్లు పేర్కొన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మక సోలార్ ప్రాజెక్టు పురోగతిని ఆయన సమీక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్