డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గత రెండు తుపాన్ల కంటే అక్వాన్ తుపాను ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 19, 20 తేదీల్లో తుపాను ప్రభావిత జిల్లాల్లో అత్యంత అప్రమత్తత అవసరమన్నారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని సూచించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ విభాగాల సమన్వయంతో పనిచేయాలన్నారు.







కామెంట్‌లు (0)