మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపిజి స్పాట్‌ అడ్మిషన్లకు అనుమతించాలి : ఎస్ఎఫ్ఐ

27 నిమిషాల క్రితం

పిజి స్పాట్‌ అడ్మిషన్లకు అనుమతించాలి
- ఎస్ఎఫ్ఐ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పిజి సీట్లను స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్‌ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ విద్యా సంస్థల్లో స్పాట్‌ అడ్మిషన్లను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కృష్ణకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి రామ్మోహన్‌రావు, కె ప్రసన్నకుమార్‌, ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షణ్ముఖ్‌, వెంకటేశ్వరరావు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎపి పిజి సెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్‌ విధానం వల్ల గత రెండేళ్లుగా విద్యార్థులు కోరుకున్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారని తెలిపారు. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో పిజి సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలో స్పాట్‌ అడ్మిషన్లకు అవకాశం కల్పించడం వల్ల సీట్ల భర్తీ, విద్యార్థుల చేరికలు పెరిగాయని గుర్తుచేశారు. ఒకవైపు ప్రయివేటు కార్పొరేట్‌ విశ్వవిద్యాలయాల్లో స్పాట్‌ అడ్మిషన్లకు అనుమతినిస్తూ, మరోవైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నిషేధించడం వివక్షాపూరితమని విమర్శించారు. ఇప్పటికే విద్యార్థుల సంఖ్య తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ పిజి విభాగాలు ఈ నిర్ణయంతో మరింత నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం కల్పించాలని, స్పాట్‌ అడ్మిషన్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తక్షణమే అనుమతులివ్వాలని డిమాండ్‌ చేశారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్