ప్రతిభ కలిగిన గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని రాజవొమ్మంగి జడ్పీటీసీ మఠం విజయభాస్కర్ అన్నారు. జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన రాజవొమ్మంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందించి వారి వెన్నంటి నిలిచారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి, గోల్డ్ మెడల్స్ సాధించిన రాజవొమ్మంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు జనవరి 15వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్కొక్కరికి రూ.6,500 చొప్పున నలుగురు విద్యార్థినులకు మొత్తం రూ.26 వేల ఖర్చు అవుతోంది. ఈనేపథ్యంలో విద్యార్థినుల ప్రతిభను గుర్తించి, ఆర్థిక ఇబ్బందులు వారి క్రీడా ప్రస్థానానికి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో జడ్పీటీసీ విజయభాస్కర్ మంగళవారం రూ.26 వేలు రిజిస్ట్రేషన్ ఫీజును అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను అభినందించిన ఆయన జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించి పాఠశాలకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం, సహకారం అందిస్తే జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ ప్రతిభను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విజయభాస్కర్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే విద్యార్థినులకు ఆర్థిక భరోసా కల్పించిన జడ్పీటీసీ విజయభాస్కర్‌ను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు అభినందించారు.
జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఆర్థిక చేయూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)