శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఇఇ 629 పోస్టులకు 84,905 మంది హాజరు

1 గంట క్రితం

84,905 candidates appeared for 629 AEE posts.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 10:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

మూడు రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ

వచ్చే నెల చివరి వారంలో ఫైనల్ కీ, మెరిట్ జాబితా

ఎపి ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్


ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో 629 అసిస్టెంట్ ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎఇఇ) పోస్టుల భర్తీకి - నిర్వహించిన ఎపి విద్యుత్ నియామక పరీక్ష -2026 - ఐదు రోజుల పాటు ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 23 నుంచి 27 వరకు ఎపితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆ ఏర్పాటు చేసిన 94 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను (సిబిటి) పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల - మధ్య నిర్వహించినట్లు ఎపి ట్రాక్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ గురువారం తెలిపారు. ఎపి ట్రాన్స్ కో, ఎపి జెన్కో, - ఎపిఎస్పిడిసిఎల్, ఎపిఇపిడిసిల్, ఎపిసిపిడిసిఎల్ - సంస్థల్లోని 629 ఎఇఇ పోస్టుల కోసం నిర్వహించిన ఈ - కామన్ రిక్రూట్మెంట్ పరీక్షకు మొత్తంగా 1,05,566 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మొత్తం = 84,905 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఎపి నుంచి 81, ఇతర రాష్ట్రాల నుంచి 13 కలిపి మొత్తం 94

కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యారు. ఆగస్టు 23న నిర్వహించిన సివిల్ ఇంజినీరింగ్ పరీక్షకు 16,183 మందికి గాను 12,301 మంది, 24న నిర్వహించిన మెకానికల్ ఇంజినీరింగ్ పరీక్షకు 9,444 మందికి గాను 6,411 మంది హాజరయ్యారు. 25న టెలికాం,ఎలక్ట్రానిక్స్ విభాగానికి నిర్వహించిన పరీక్షకు 26,237 ລ້ ລ້ 19,947 ລ້ హాజరయ్యారు. అత్యధికంగా 53,702 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరీక్షను ఈనెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించగా 46,244 మొత్తం హాజరయ్యారు. నాలుగో రోజు 26న 28,695 మందికి గాను 25,028 మంది, ఐదో రోజు ఆగస్టు 27న 25,006 మందికి గాను 21,216 మంది పరీక్షకు హాజరయ్యారు. 27న ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరీక్షతో ఐదు రోజుల నియామక పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్ష అనంతరం మూడు రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేసి, ఏడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ, నార్మలైజ్డ్ స్కోర్లు, మెరిట్ జాబితాను వచ్చేనెల చివరి వారంలో విడుదల చేయాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు, అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగా తుది ఎంపిక, సంస్థల వారీగా కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పుకార్లు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, మోసపూరిత ప్రకటనలు నమ్మి మోస పోవద్దని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్