ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం రక్షాబంధన్ కావడంతో ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 'అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పర్వదినం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం నింపాలని కోరుకుంటున్నాను. ఈ రాఖీ పౌర్ణమి మీ జీవితాల్లో వెలుగులు పంచాలని, ప్రేమానుబంధాలు నింపాలని, సహోదర భావంతో సమాజం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రక్షాబంధన్ శుభాకాంక్షలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 10:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)