సిఐఎ డైరెక్టర్ మాస్కో పర్యటనపై మీడియా కథనాలు
వాషింగ్టన్ : సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ) డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ఇటీవల రష్యాలో పర్యటించడం సంచలనంగా మారింది. ఈ పర్యటన గురించి ఎలాంటి వివరాలు అధికారంగా వెల్లడికాలేదు. అయితే నాటో సభ్య దేశాలపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యాను హెచ్చరించేందుకు సిఐఎ డైరెక్టర్ పర్యటించారని అమెరికా మీడియా బుధవారం నివేదించింది. నాటో కూటమిలోని కొన్ని సభ్య దేశాలపై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్న నేపథ్యంలో జాన్ రాట్ క్లిఫ్ పర్యటన జరిగిందని మీడియా తన కథనాల్లో తెలిపాయి. రాట్ క్లిఫ్ మాస్కో పర్యటన సాధారణ విషయమేనని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన అనంతరం ఇలాంటి కథనాలు రావడం విశేషం. అయితే, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ప్రారంభమైన తరువాత సిఐఎ డైరెక్టర్ ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2021లో సిఐఎ డైరెక్టర్ రష్యాలో పర్యటించారు.








కామెంట్‌లు (0)