శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రపంచ వాణిజ్యానికి టారిఫ్ల ముప్పు

1 గంట క్రితం

Threat of tariffs to global trade
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 11:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : డోనాల్డ్ ట్రంప్ సర్కార్ విధిస్తున్న టారిఫ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయి. ప్రధాన దేశాలపై వాషింగ్టన్ విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, సుంకాలతో ప్రపంచ వ్యాప్తంగా స్థానిక పరిశ్రమలు, ఎగుమతిదారులు తీవ్ర ఎదుర్కొంటున్నారని టైమ్స్ తన కథనంలో విశ్లేషించింది. అమెరికా ప్రభుత్వం వాణిజ్య లోటుతో పాటు రష్యా చమురు కొనుగోళ్లు, ఇమ్మిగ్రేషన్, డ్రగ్స్ అక్రమ రవాణా, సరిహద్దు భద్రత వంటి అంశాలను సుంకాల విధింపునకు కారణాలుగా చూపడం ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో అనిశ్చితిని పెంచుతోంది. భారత్పై 50 శాతం వరకు సుంకాల భారం, కెనడా, చైనా, మెక్సికో, కొలంబియా తదితర దేశాలపై అదనపు టారిఫ్లు విధించడంతో ఎగుమతిదారుల వ్యయాలు పెరిగి, అంతర్జాతీయ సరఫరా గొలుసులపై ఒత్తిడి పెరుగుతోంది. టారిఫ్ పెంపుతో అమెరికా మార్కెట్పై ఆధారపడిన దేశాల ఉత్పత్తులు అక్కడ మరింత ఖరీదుగా మారే అవకాశం ఉంది. దీంతో ఎగుమతుల డిమాండ్ తగ్గడం, ఉత్పత్తి తగ్గించడం, పెట్టుబడుల నిర్ణయాలను వాయిదా వేయడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. ముఖ్యంగా భారత్ వంటి దేశాలపై అధిక సుంకాలు పడటం వల్ల టెక్స్టైల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఔషధాలు, ఐటీ సేవలకు సంబంధించిన వ్యాపారాలపై పరోక్ష ప్రభావం పడుతుంది. అమెరికా విధానాల్లో తరచూ మార్పులు, కొత్త సుంకాల హెచ్చరికలు ప్రపంచ కంపెనీలకు దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలను రూపొందించడాన్ని కష్టతరం చేస్తున్నాయి. దేశాలు పరస్పరం ప్రతీకార సుంకాలు విధిస్తే వాణిజ్య వ్యయం మరింత పెరిగి, చివరకు దాని ప్రభావం వినియోగదారుల ధరలపై పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ వాణిజ్య వృద్ధి మందగించడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, పెట్టుబడుల అనిశ్చితి మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్