మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవేలేరుపాడులో పెద్దపులి..

13 నిమిషాల క్రితం

వేలేరుపాడులో పెద్దపులి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 09:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వేలేరుపాడు రూరల్ (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పెద్దపులి సంచారం మళ్లీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొత్తూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కరాటం బ్రహ్మయ్యకు చెందిన రెండు లేగ దూడలు, ఒక ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది. కొంతకాలంగా పేరంటాలపల్లి అవతలి ఒడ్డుపై ఉన్న పులి ఆదివారం రాత్రి గోదావరి దాటి నాళ్లవరం పంచాయతీ చిగురు మామిడి బీట్ పరిధిలోని కొత్తూరు గ్రామంలోకి అడుగుపెట్టిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించారు. ఆ ప్రాంతానికి ఎవరూ ఒంటరిగా వెళ్లరాదని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్