మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదౌర్జన్యంతోనే గెలిచారు

23 నిమిషాల క్రితం

దౌర్జన్యంతోనే గెలిచారు
- ఎమ్మెల్యే అమిలినేనిపై వైసిపి ఆగ్రహం
- కల్యాణదుర్గంలో నిరసన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎమ్మెల్యే అమిలినేనిపై వైసిపి ఆగ్రహం

  • కల్యాణదుర్గంలో నిరసన

​ప్రజాశక్తి -కల్యాణదుర్గం టౌన్ (అనంతపురం జిల్లా): ప్రశాంతతకు నిలయమైన అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో టిడిపి స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దౌర్జన్యం, అలజడులు సృష్టించి స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించుకున్నారని వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు, కౌంటింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యే ఆయన బంధువులు, ప్రయివేటు వ్యక్తుల చేసిన దౌర్జన్యాలపై వైసిపి ఆధ్వర్యంలో మంగళవారం కల్యాణదుర్గం పట్టణంలో వాల్మీకి సర్కిల్ నుంచి వైఎస్‌ఆర్‌ పార్క్ వరకు వేలాది మందితో నిరసన ర్యాలీ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో దౌర్జన్యంతో గెలుపును వారిఖాతాలో వేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. వైసిపి సమన్వయకర్త రంగయ్య మాట్లాడుతూ కల్యాణదుర్గంలో సురేంద్రబాబు ప్రయివేటు సైన్యం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి శ్రేణులు గెలిచిన వైసిపి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లపై దాడులు చేసి అక్రమంగా డిక్లరేషన్లు తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజా మద్దతుతో గెలుపొందిన తమ అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ర్ట నాయకుడు ఉమామహేశ్వర నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

అనంత గృహ నిర్బంధం

నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం నుంచి బయళ్దేరిని మాజీ ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు ఏది చెబితే పోలీసులు అది చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్