మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకేంద్ర సాధికార కమిటీ అడిగిన వివరాలివ్వండి

16 నిమిషాల క్రితం

కేంద్ర సాధికార కమిటీ అడిగిన వివరాలివ్వండి 
- అధికారులకు వారం రోజులు గడువు విధించిన కాంతీలాల్ దండే image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 09:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అధికారులకు వారం రోజులు గడువు విధించిన కాంతీలాల్ దండే

ప్రజాశక్తి - ఏలూరు : కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దులు హేతుబద్ధీకరణ, జిరాయితీ, డి.ఫారం భూమి, తదితర అంశాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ కోరిన అదనపు సమాచారాన్ని వారం రోజుల్లోగా సమర్పించాలని పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతీలాల్ దండే అధికారులను ఆదేశించారు. కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణ, జిరాయితీ, డి.ఫారం భూమి వివరాలు, సదరు భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు తదితర అంశాలపై కలెక్టర్ వెట్రిసెల్వి, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్, ప్రిన్సిపల్ చీఫ్ అఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్‌ పివి.చలపతిరావు, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ జ్యోతిలతో కలిసి స్థానిక కలెక్టరేట్‌లో కాంతీలాల్ దండే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి, ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిలాల్లో కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ పరిధిలో ఉన్న జిరాయితీ, డి.ఫారం పట్టా భూముల విస్తీర్ణం, స్థితి, అటువంటి భూముల ప్రస్తుత విస్తీర్ణం, స్థితితోపాటు, కలెక్టర్ల ఉత్తర్వుల ప్రకారం డి-ఫారం పట్టాల రద్దుకు సంబంధించిన వివరాలను సమర్పించాలన్నారు. నోటిఫై చేసిన కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రాంతం, దాని సరిహద్దును గుర్తించి నిర్థారించడం, గ్రామాల వారీగా సర్వే నంబర్ల వివరాలు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, కాలిబాటలు, విద్యుత్ లైన్లు, ఇతర ప్రస్తుత మౌలిక సదుపాయాల వివరాలతో మ్యాప్ లను అందిచాలని ఆదేశించారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, రైల్వే, విద్యుత్, అటవీ శాఖలకు సంబంధించిన వివరాలు, పునరావాస ప్రాంతాల కోసం ప్రతిపాదించిన ప్రాంతాల ప్రస్తుత క్షేత్రస్థాయి స్థితిని, అక్కడ ఇప్పటికే ఉన్న పక్షులు, ఆవాస వివరాలు, ప్రతిపాదిత అభయారణ్య హేతుబద్ధీకరణ పునరావాసం, పర్యావరణ ప్రభావాలను, పరిరక్షణ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల అంచనాలను సమర్పించాలని, సదరు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర సాధికార కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. సమావేశంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఎంజె.అభిషేక్ గౌడ, కెఆర్.కల్పశ్రీ, డిఎఫ్ఒలు సందీప్ రెడ్డి, త్రిమూర్తులు రెడ్డి, ఆర్‌డిఒ లక్ష్మిప్రసన్న, డిపిఒ మల్లికార్జునరావు, ట్రాన్స్‌‌కో ఎస్ఇ కెఎం.అంబేద్కర్, కొల్లేరు ప్రాంత మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ, అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్