అనంతపురం జిల్లా : అనంతపురం కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో రెండో అంతస్తు నుంచి విద్యార్థిని కిందపడిన ఘటన మంగళవారం జరిగింది. బిఎ హిస్టరీ సెకండ్ ఇయర్ చదువుతున్న వసంత అనే విద్యార్థిని ఈరోజు ఉదయం కళాశాల రెండో అంతస్తు నుండి కిందికి పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కాలేజి ప్రిన్సిపల్ స్పందించి.. విద్యార్థినిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విద్యార్థి సొంత ఊరు నార్పల మండలం బి.పప్పూరు గ్రామంగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై విద్యార్థిని కళ్లు తిరిగి పడిందా లేక కాలు జారి పడిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా ? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాలేజి రెండో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థిని
42 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026, 12:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)