మంగళవారం, 10 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition15 నుంచి ఎఐకెఎస్ జాతీయ మహాసభలు

56 నిమిషాల క్రితం

aiks.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026, 08:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • 14, 15 తేదీల్లో జెండావిష్కరణ

  • విజయవంతం చేయాలని ఎపి రైతు, కౌలు రైతు సంఘాలు పిలుపు

జాశక్తి-అమరావతి బ్యూరో : ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) 36వ జాతీయ మహసభలు తెలంగాణ రాష్ట్రం నల్గొండలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకూ జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభల్లో ప్రధానంగా దేశంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. కొద్ది కాలంగా కేంద్ర ప్రభుత్వం.. అమెరికా తదితర యూరోపియన్ దేశాలతో చేసుకున్న ఒప్పందాల కారణంగా పర్యవసానాలు, వ్యవసాయ రంగంపై దాని ప్రభావం తదితర అంశాలపైనా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణ, పంటలకు మద్దతు ధరలు, ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చిస్తామన్నారు. ఈ నెల 15న లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆహ్మాన సంఘం నిర్ణయించినట్లు వెల్లడించారు. మహాసభల్లో భాగస్వాములు కావాలని రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ.. ఈ నెల 14, 15 తేదీల్లో రైతులు, కౌలు రైతులను సమీకరించి జెండావిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇటీవల వరుస తుపానుల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. కష్టాల్లో ఉన్న కౌలు రైతులు, ‘రైతుల సమస్యలు విందాం.. తెలుసుకుందాం’ అనే పేరుతో గ్రామాల్లో పర్యటిస్తూ ఈ మహాసభల ప్రచారం కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎఐకెఎస్ జాతీయ మహాసభల పోస్టరును ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి బలరామ్, రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఆంజనేయులుతో కలిసి ఈ సందర్భంగా కె ప్రభాకర్ రెడ్డి, ఎం హరిబాబు ఆవిష్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్