- థింసాతో స్వాగతం పలకనున్న 14వేల మంది బాలికలు
ప్రజాశక్తి-విజయనగరంకోట : అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు ఉమ్మడి ఉత్తరాంధ్ర ప్రాంతం ముస్తాబవుతోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించే లక్ష్యంతో వేలాది మంది గిరిజన బాలికలు గిరిజన సంప్రదాయ నృత్యమైన 'థింసా' ప్రదర్శనకు సర్వం సిద్ధం చేస్తున్నారు. పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం ఐటిడిఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 8,9,10వ తరగతి చదువుతున్న సుమారు 14వేల మంది గిరిజన బాలికలు ఈ భారీ థింసా నృత్య ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనను విజయవంతం చేసేందుకు ప్రస్తుతం ముమ్మరంగా నృత్యాభ్యాసన చేస్తున్నారు. వేలాది మంది గిరిజన బాలికలు ఒకే వేదికపై ప్రదర్శన ఇవ్వడం దేశంలోనే ఇదే ప్రధమమని భావిస్తున్నారు. దీంతో కొత్త చరిత్రను లిఖించి, గిన్నిస్ బుక్‌లో చోటు సాధించాలన్న పట్టుదల నిర్వాహకులలో కనిపిస్తోంది. ఈ బాలికంతా బుధవారం నుంచీ జిల్లాలోనే సాధన చేయనున్నారు. వీరిని రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.








కామెంట్‌లు (0)