సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Markets - మార్కెట్లలో అమ్మకాల తుఫాన్ - కుప్పకూలిన సెన్సెక్స్

1 గంట క్రితం

Sell-off storm in markets – Sensex crashes.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బిజినెస్ : అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల ప్రభావంతో ... దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. ప్రారంభ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పడిపోయి 73,000 స్థాయికి దిగువకు చేరింది. నిఫ్టీ కూడా 275 పాయింట్లు కోల్పోయి 23,000 మార్కును దాటింది. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 72,995 వద్ద, నిఫ్టీ 22,865 వద్ద కొనసాగుతున్నాయి.


అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు మదుపర్లపై తీవ్ర ప్రభావం చూపాయి. హర్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించినట్లు వచ్చిన వార్తలతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 2 శాతం పెరిగి బ్యారెల్‌కు 106.60 డాలర్లకు చేరింది. అదే సమయంలో అమెరికా బాండ్ యీల్డ్స్ 5 శాతానికి పైగా కొనసాగడం కూడా మార్కెట్లపై ఒత్తిడిని పెంచింది.


దేశీయంగా విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కూడా మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. గత శుక్రవారం ఎఫ్ఐఐలు రూ.3,696 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 95.89 వద్ద కొనసాగుతోంది.


భారీ అమ్మకాల ప్రభావంతో హిందాల్కో, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్ తదితర ప్రధాన షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. అయితే ప్రతికూల పరిస్థితుల్లోనూ కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఎస్‌బీఐ లైఫ్ వంటి కొన్ని షేర్లు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి మరికొంత కాలం కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్