- భగత్ సింగ్ జయంతి సభలో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు పిలుపు
ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : దేశాన్ని కార్పొరేట్ శక్తులు నుండి, మతోన్మాద శక్తులు నుండి ప్రజా స్వామ్యం, లొకిక భారత దేశాన్ని కాపాడేందుకు ఉద్యమిస్తామని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు. సోమవారం భగత్ శింగ్ 119వ జయంతి సందర్బంగా కృష్ణా దియేటర్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ
బ్రిటీష్ వాడి దాస్య శృంకళాలు నుండి భారత దేశాన్ని విముక్తి చేసేందుకు తన ప్రాణాల్ని తృన ప్రాయంగా అర్పించిన దేశ భక్తుడు షాహీద్ సర్ధార్ భగత్ సింగ్ అని ఆయన ఆశయం సాదనకి ప్రజలు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. నాడు భగత్ సింగ్ పరాయి పాలన అంత మొండెంచేందుకు పోరాడితే నేడుమోడీ ప్రభుత్వం అదే విదేషి సామ్రాజ్య వాదులతో జతగట్టి అమెరికాకి దాసోహం అంటూ భారత దేశ సార్మబౌత్వాన్నీ తాకట్టు పెట్టేస్తున్నారన్నారు. మరోవైపు కార్పొరేట్ శక్తులు కు ఊడిగం చేస్తూ దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారన్నారు. సుసంపన్న మైన భారత దేశాన్ని, దోపిడీ లేని సామ్యవాదాన్ని సాధించాలన్న భగత్ సింగ్ ఆశయం ఇంకా మిగిలే ఉందని, నేడు బీజేపీ పాలనలో ఆకలి, దరిద్రం, నిరుద్యోగుo,నిత్వసర సరుకులు ధరలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయాని, పేదరికం తో దేశంలో కొనుగోలు శక్తి లేక ఉన్న పరిశ్రమలు మూత పడిపోతున్నయన్నారు. మరోవైపుప్రభుత్వరంగపరిశ్రమలు అమ్మేస్తున్నారని అన్నారు. కార్మిక చాట్టాలు మార్చి లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులును యజమానులుకి తాకట్టు పెట్టారు, వ్యవసాయం కార్పొరేట్ శక్తులుకి కట్ట బెట్టే నల్ల చట్టాలు తెచ్చారన్నారు. ఈ పరిస్థితుల్లో దేశ సర్వబౌ మత్వాన్ని, మత సామారస్యాన్ని, రాజ్యాంగన్ని రక్షించు కునేందుకు యువత నడుం కట్టాలని, అందుకు భగత్ సింగ్ జయంతి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో నగర కమిటి సభ్యులు బంగారం, రమణ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)