బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరేపు తీరం దాటనున్న ‘అక్వాన్‌’

20 నిమిషాల క్రితం

Another cyclone in the Bay of Bengal - heavy rains in AP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దక్షిణ మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతుందని ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రఖర్‌ ‌జైన్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం రాత్రికి నరసాపురానికి 500 కిలోమీటర్లు, కళింగపట్నంకు 540, చెన్నైకి 560, గోపాల్‌పూర్‌కు 630, పూరీకి 690 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్ననికి నరసాపురం-పూరీ మధ్య ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దీని ప్రభావంతో గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే శ్రీకాకుళం, టెక్కలి, పలాస 3 ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌, విజయనగరంలో 1 ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, సీతంపేటలో 2 ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌ ‌బృందాలు చొప్పున మొత్తంగా 5 ఎన్‌‌డిఆర్‌ఎఫ్‌, 1 ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌, స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్