బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionIND vs NZ 1st Test : టెస్టుల్లో టీమిండియాకు తొలి పరీక్ష‍

31 నిమిషాల క్రితం

india.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:01 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేటినుంచి భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్ట్‌

  • ఉదయం 3.30గం.ల నుంచి

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్ గడ్డపై కీలక టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. వెల్లింగ్టన్‌లోని చారిత్రక బేసిన్ రిజర్వ్ స్టేడియంలో గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. 2025 ఇంగ్లండ్ పర్యటన తర్వాత టీమిండియా విదేశాల్లో ఆడుతున్న తొలి టెస్టు ఇదే. విదేశీ గడ్డపై, అందులోనూ పచ్చిక పిచ్‌లపై టెస్టు గెలుపు, అదీ కివీస్‌ గడ్డపై ఆ జట్టును ఓడించాలంటే టీమిండియా సమిష్టిగా రాణించాల్సి ఉంది. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకంతో బరిలోకి దిగాలని యోచిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్లు, న్యూజిలాండ్-ఎతో అనధికారిక టెస్టుల ప్రదర్శన ఆధారంగా తుది జట్టులో నలుగురు పేసర్లకు చోటు దక్కడం ఖాయం. ఇక బ్యాటింగ్‌ ఓపెనింగ్ విభాగంలో కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్‌ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. న్యూజిలాండ్-ఎతో తొలి అనధికారిక టెస్టులో రాహుల్ విఫలమైనా... అతని స్థానానికి ఢోకా లేదు. కివీస్‌ పిచ్‌లపై అతని టెక్నిక్, అనుభవం జట్టుకు అత్యవసరం. ఇక జైస్వాల్ రెండు, మూడు అనధికారిక టెస్టుల్లో శతకాలతో ఫామ్‌లోకి వచ్చాడు. అతని దూకుడే కివీస్ పేసర్లకు చెక్ పెట్టగల సమర్ధుడు. ఇక నంబర్-3 స్థానానికి దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీలంక పర్యటన, న్యూజిలాండ్-ఎతో మ్యాచ్‌లలో పడిక్కల్ రాణించాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ స్థానం ఖాయం. ప్రాక్టీస్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోలతో ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తెరపడింది. పంత్‌కు తుదిజట్టులో చోటు లభిస్తే.. లోయర్‌ మిడిలార్డర్‌లో ఎడమ-కుడి కలయిక, వేగంగా పరుగులు రాబట్టవచ్చు. ఆ తర్వాత స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా. బ్యాట్‌తోనే కాదు, వెల్లింగ్టన్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అతని స్పిన్ కీలకం కానుంది. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి ఎంపిక దాదాపు ఖాయం. అతను నాలుగో పేసర్ లోటును, ఎనిమిదో బ్యాటర్ లోటును పూడ్చగలడు. అంచానాల మేరకు భారత్ నలుగురు స్పెషలిస్టు పేసర్లతో వెళ్లడం ఖాయం. బుమ్రా నాయకత్వంలోని పేస్‌ దళంలో ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, గుర్నూర్ బ్రార్‌కు చోటు దక్కే ఛాన్స్‌ ఉంది. బౌన్సీ పిచ్‌పై హిట్-ద-డెక్ బౌలర్ ప్రసిద్ధ్, సీమ్ మూవ్‌మెంట్‌తో ఆకాశ్‌దీప్, యువ పేసర్లు గుర్నూర్ కివీస్‌ను ఇబ్బంది పెట్టగల సమర్ధులు.

మరోవైపు కివీస్‌ జట్టు టి20, వన్డే సిరీస్‌లను చేజార్చుకొన్న నిరాశతో ఉన్నా.. టెస్టుల్లో రాణించాలని వేయికళ్లతో చూస్తోంది. కనీసం టెస్ట్‌ సిరీస్‌నైనా చేజిక్కించుకొని టీమిండియాకు చెక్‌ పెట్టాలని ఈ టెస్ట్‌కు సిద్ధమైంది.

జట్లు(అంచనా):

భారత్‌: శుభ్‌మన్(కెప్టెన్), కేఎల్ రాహుల్, జైస్వాల్, పడిక్కల్, పంత్ (వికెట్ కీపర్), జడేజా, నితీష్ కుమార్, బుమ్రా, ప్రసిద్ధ్, ఆకాశ్‌దీప్, గుర్నూర్ బ్రార్.

న్యూజిలాండ్‌: లాథమ్‌(కెప్టెన్‌), బ్లండెల్‌ (వికెట్‌ కీపర్‌), కాన్వే, నికోల్స్‌, రచిన్‌ రవీంద్ర, మిఛెల్‌, ఫిలిప్స్‌, స్మిత్‌, హెన్రీ, జేమీసన్‌, డఫీ/టిక్నెర్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్